హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయ వంటకాలకు రష్యన్స్ ఫిదా

బ్రిక్స్ సదస్సులో అందించిన భారతీయ వంటకాల రుచులకు రష్యన్ జర్నలిస్ట్ ఫిదా అయ్యారు. మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆహారం చాలా అద్భుతంగా ఉందని ఆమె ప్రశంసించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలను ఇక్కడ ప్రదర్శించారని సంతోషం వ్యక్తం చేశారు. సదస్సు మరో మూడు రోజులు ఉంటే బాగుండేదని.. భవిష్యత్తులోనూ భారత్ నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు రావాలనుకుంటున్నట్లు చెప్పారు.