హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని ఆలయాలు గణపతి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ముంబైలోని ప్రసిద్ధమైన లాల్‌బాగ్‌చా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.