హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నహర్త ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త శక్తి, ఉత్సాహం నిండాలని ఆకాంక్షించారు. అందరూ తలపెట్టిన పనుల్లో విజయం సాధించాలని, దేశం నిరంతరం అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భక్తుల కష్టాలను తీర్చే ఆ వినాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ మోదీ పోస్ట్ చేశారు.