ఆసియా కప్ గెలుపొందిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది భారత క్రికెట్‌కు ఎంతో గర్వకారణమైన క్షణమని ఆయన కొనియాడారు. టోర్నీ ఆసాంతం క్రీడాకారిణులు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నిలకడ, క్రీడాస్ఫూర్తి అద్భుతమన్నారు. మహిళా జట్టు సాధించిన ఈ చారిత్రక విజయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు.
వార్తలు
వాళ్ల ఆత్మవిశ్వాసం అద్భుతం: మోదీ


