హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు టీబీజేపీ కార్యాలయంలో గణేష్ ఉత్సవాలు

TG: తెలంగాణ BJP రాష్ట్ర కార్యాలయంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా పార్టీ కార్యాలయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు పాల్గొననున్నారు.