హైదరాబాద్: 28°C
వార్తలు

దంచికొడుతున్న వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరుతో పాటు పలు చోట్ల వర్షం దంచికొట్టడంతో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.