2029 నాటికి ఎన్డీయే పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఉమ్మడి పౌరస్మృతిని (UCC) అమలు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మతంతో సంబంధం లేకుండా వివాహం, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల్లో అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తెచ్చామన్నారు. 2029 నాటికి 21 రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపారు.
వార్తలు
ఉమ్మడి పౌరస్మృతిపై అమిత్‌షా కీలక ప్రకటన


