హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ జెండా ఎగురవేస్తాం: అంబటి

AP: రెండేళ్లుగా అధికారం లేకున్నా కార్యకర్తలే పార్టీకి బలమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు. ఎంతటి అధికార బలాన్నయినా ఎదుర్కొని, 76 కార్పొరేషన్ వార్డుల్లోనూ గెలుపే లక్ష్యంగా పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.