హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సింగర్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం

బర్నాలా జిల్లా ఫర్వాహి గ్రామంలోని పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధూ నివాసంపై ముగ్గురు మాస్క్ ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన నిందితులు గేట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరు రౌండ్ల కాల్పులు కాల్చారు. ఘటన సమయంలో సింగర్ ఆస్ట్రేలియాలో ఉండగా, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.