హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వాయిదా

NDL: వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో నంద్యాల కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. వ్యయప్రయాసలకు గురికాకుండా సహకరించాలని కలెక్టర్ కోరారు.