NDL: నేడు నిర్వహించాల్సిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వాయిదా పడింది. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎస్పీ సునీల్ పొరాణ్ తెలిపారు. బొమ్మలసత్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తదుపరి కార్యక్రమం తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎస్పీ తెలిపారు.
వార్తలు
పోలీసు ప్రజా సమస్యల వేదిక వాయిదా


