E.G: రాజమండ్రిలో వినాయక చవితి వేడుకలను పూర్తి భద్రతతో నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఆదివారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మండపాల నిర్మాణం, విద్యుత్ రక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్ విభాగాల నిబంధనలు పాటించాలన్నారు. నిమజ్జనం వేళ పిల్లలు, భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.
వార్తలు
వినాయక చవితి వేడుకల్లో భద్రత పాటించాలి: కమిషనర్


