RR: షాద్‌నగర్ ప్రధాన చౌరస్తాలో YSR విగ్రహాన్ని తొలగించిన అధికారులు, అదే ప్రాంతంలో వాహనదారులకు ఇబ్బందిగా మారిన భారీ గుంతలను మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపించారు. పరిగి రోడ్డు మార్గంలో అడుగడుగునా ఏర్పడిన గుంతల వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
వార్తలు
'మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించండి'


