హైదరాబాద్: 28°C
వార్తలు

పవిత్ర పత్రాలపై అవగాహన సదస్సు

RR: నల్లగండ్ల అశోకవనం రాక్ గార్డెన్‌లో సీఎంసీ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పవిత్ర 21 పత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి మనకు అందించిన ఆకులు, పూలతోనే భక్తిని చాటుకోవచ్చని, ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని ఈ సాంప్రదాయం గురించి తెలుసుకున్నారు.