హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి జిన్‌పింగ్ అభినందనలు

బ్రిక్స్ దేశాల ఐక్యతపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు విజయవంతంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. 'అన్ని దేశాలు సమానమే. అంతర్జాతీయ చట్టాలు అన్ని దేశాలకు సమానం. ప్రపంచ పరిస్థితులు తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నాయి. నియంతృత్వ పోకడలకు గ్లోబల్ సౌత్ అభివృద్ధే సమాధానం. బ్రిక్స్ దేశాలు ఐక్యత, సహకారం బలోపేతం చేసుకోవాలి' అని జిన్‌పింగ్ సూచించారు.