హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబయి రోడ్లపై నితిన్ గడ్కరీ అసంతృప్తి

ముంబయి రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ కష్టాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గంట ఆలస్యంగా వచ్చిన ఆయన, ట్రాఫిక్ వల్లనే ఆలస్యమైందని తెలిపారు. ముందుగానే బయల్దేరినప్పటికీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని, తన తప్పునకు తానే మూల్యం చెల్లించుకుంటున్నానని పేర్కొనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.