హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలకు చేరుకున్న అంబానీ బస్సులు

AP: టీటీడీకి అనంత్ అంబానీ విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ట్రిక్ 'ధర్మరథం' బస్సుల్లో తొలి విడతగా 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. రూ.27.5 కోట్ల విలువైన ఈ బస్సులతో పాటు ఛార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ అందిస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈనెల 16న సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు.