హైదరాబాద్: 28°C
వార్తలు

చంద్రబాబు పాలన APకి హానికరం: కన్నబాబు

AP: ప్రజలకు మూడు రోజులకు ఒకసారి నీరిచ్చే నాయకుడు వాటర్ మ్యాన్ ఎలా అవుతారని.. మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. విశాఖలో తాగునీటితో ప్రజలు అలమటిస్తుంటే.. సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని.. YCPది వెన్ను చూపని పార్టీ అని చెప్పారు. చంద్రబాబు పాలన అన్ని విధాలుగా రాష్ట్రానికి హానికరమని వ్యాఖ్యానించారు.