హైదరాబాద్: 28°C
వార్తలు

కాల్వలో పడ్డ బస్సు.. 30 మందికి గాయాలు

తమిళనాడులోని తెన్‌కాశీలో ఘోర ప్రమాదం తప్పింది. వంతెన రక్షణ గోడను ఢీకొని ఓ ప్రభుత్వ బస్సు కాలువలో పడిపోయింది. అయితే కాలువలో నీరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సులో ఉన్న 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెస్య్కూ సిబ్బంది రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.