హైదరాబాద్: 28°C
వార్తలు

నా తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా: గడ్కరీ

ముంబై ట్రాఫిక్‌పై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ వల్ల సభకు గంట ఆలస్యంగా వచ్చి క్షమాపణ కోరారు. తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటానని అన్నారు. అంతేకాదు దశాబ్దాల క్రితం నాటి మౌలిక వసతులే ఇందుకు కారణమన్నారు. . పాత ఫ్లైఓవర్లను మార్చి, అమెరికా తరహా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మహారాష్ట్ర సీఎంకు సూచించారు.