హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సు.. నేతలకు మోదీ స్వాగతం

ఢిల్లీలోని భారత్ మండపంలో రెండో రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. వినూత్న ఆవిష్కరణలు, పరస్పర సహకారం, సమ్మిళిత ప్రపంచాభివృద్ధిపై వీరు చర్చించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం నుంచి ఆరు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.