AP: చిత్తూరు జిల్లా పీలేరులో ఎర్రచందనం స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. ఫారెస్ట్ సిబ్బందిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చేజింగ్‌లో వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగింది. స్మగ్లర్ల వాహనంలోని ఐదుగురిలో ఇద్దరిని ఫారెస్ట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరు తమిళనాడు కళ్లకురిచ్చి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన సిబ్బందిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
పీలేరులో ఎర్రచందనం స్మగ్లర్లు బీభత్సం


