హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రధాని మోదీ వల్లే భారత్‌తో మా బంధం బలోపేతం’

ప్రధాని మోదీ వల్లే భారత్‌తో తమ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు. మోదీతో జరిగిన 45 నిమిషాల భేటీ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధం రోజురోజుకూ మెరుగుపడుతోందని, ఇది ఎప్పటికీ మారేది కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో చేయి కలిపి నడిచిన క్షణాలు ప్రత్యేకంగా నిలిచాయన్నారు.