హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ బాధితులకు రూ. 20.27 లక్షల రీఫండ్

మెదక్ పోలీసు న్యాయశాఖల సమన్వయంతో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,254 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో 3,984 డీడీ, 538 ఐపీసీ, 732 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో 14 సైబర్ కేసుల్లో బాధితులకు రూ.20.27 లక్షలు రీఫండ్ ఇప్పించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.