హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సులో భారతీయ సంస్కృతి 'నవరస'

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బ్రిక్స్ సదస్సు గాలా డిన్నర్ అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రదర్శించిన 'నవరస' సాంస్కృతిక కార్యక్రమం అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే 'బ్రిక్స్ సింఫనీ' పేరుతో సభ్య, భాగస్వామ్య దేశాల వాయిద్యకారులందరూ కలిసి ఒకే వేదికపై అందించిన సంగీత విభావరి(ఒకే లయ, భిన్న సంస్కృతులు) ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.