హైదరాబాద్: 28°C
వార్తలు

కొచ్చి ఎయిర్ పోర్టులో రోబో సేవలు

కేరళంలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (CIAL) తన విమానాశ్రయంలో రోబోటిక్ సేవలను ప్రవేశపెట్టింది. తొలి దశలో డొమెస్టిక్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలోని కళాంగన్ ఆర్ట్ మ్యూజియంలో రోబోను ఏర్పాటు చేశారు. పుణెకు చెందిన కైనెటిక్స్ రోబోటిక్స్ రోబోను అభివృద్ధి చేసింది. ఈ రోబో ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది. విమానాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తుంది.