VZM: వినాయక ఉత్సవాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ ఉత్సవా నిర్వాహకులకు శనివారం హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేసే ముందు నిర్వాహకులు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని చెప్పారు. నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమంలో పోలీసు శాఖ సూచనలు పాటించాలని కోరారు.
వార్తలు
'పోలీస్ శాఖ సూచనలు పాటించాలి'


