ASR: వినాయక చవితి మండపాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అరకు ఎస్సై టీ. మల్లేశ్వరరావు సూచించారు. మండపాల వద్ద ఇద్దరు నిర్వాహకులు నిరంతరం ఉండాలని, రాత్రివేళ కాపలా ఉండాలన్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటులో జాగ్రత్తలు పాటించాలని, రాత్రి 10 గంటల తర్వాత మైక్ నిలిపివేయాలని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
వార్తలు
'వినాయక మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి'


