హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దు'

PPM: విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీని పినాకిల్ సంస్థకు అప్పగించొద్దని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపో వద్ద విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ చర్యలను వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు పాల్గొన్నారు.