హైదరాబాద్: 28°C
వార్తలు

వాహన తనిఖీలు.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

ASR: చింతపల్లి టీ జంక్షన్ వద్ద శనివారం సీఐ బీ.సింహాచలం సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్‌తో ప్రయాణిస్తే ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తీవ్రత తగ్గుతుందని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు.