హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటికీ టీడీపీతో ఈశ్వరి జోరు

ASR: జీ.మాడుగుల (మం) ఎస్.కొత్తూరులో శనివారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి పాల్గొన్నారు. రెండేళ్ల నమ్మకం-సంక్షేమం-అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రహదారులు, తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.