హైదరాబాద్: 28°C
వార్తలు

తీవ్రవాదాన్ని ఖండించిన బ్రిక్స్ సదస్సు

తీవ్రవాద కార్యకలాపాలను బ్రిక్స్ సదస్సు తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని సమూలంగా అరికట్టాలని స్పష్టం చేసింది. గతేడాది జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన సదస్సు, సీమాంతర ఉగ్రవాద చర్యలను తప్పుబట్టింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేవారిని, మద్దతిచ్చే దేశాలను లేదా వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని సదస్సు తేల్చిచెప్పింది.