హైదరాబాద్: 28°C
వార్తలు

జిన్‌పింగ్‌కు మోదీ తన చిత్రపటం గిఫ్ట్.. క్లారిటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే, వీడియో వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది. ఈ వీడియో 2019 నాటిదని.. ఏడేళ్ల క్రితం జిన్‌పింగ్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా మోదీకి దీన్ని అందజేశారని తెలిపింది.