హైదరాబాద్: 28°C
వార్తలు

జైలు గార్డుపై కాల్పులు.. ఖైదీ పరారీ యత్నం

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా జైలులో ఖైదీ నీలేష్ ఠాకూర్ పరారీకి యత్నించాడు. ఈ క్రమంలో జైలు గార్డు దిగ్విజయ్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. గాయపడిన గార్డు ఖైదీని అడ్డుకోగా, తోటి సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. జైలులోకి తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి ఖైదీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.