ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలకు పరిష్కారం చూపించాలని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 'కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి బాధ్యత తీసుకుందాం. ఏఐ, సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలి. బ్రిక్స్ సభ్యదేశాలు.. గ్లోబల్ సౌత్ దేశాలకు దిశానిర్దేశం చేయాలి. సమస్యల పరిష్కారం దిశగా బాధ్యత తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది' అని పేర్కొన్నారు.
వార్తలు
సమస్యల పరిష్కారానికి భారత్ సిద్ధం: మోదీ


