హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి అడుగులో మానవాభివృద్దే కీలకం కావాలి: మోదీ

బ్రిక్స్ సదస్సుకు వచ్చిన అతిథులందరికీ ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'బ్రిక్స్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు పూర్తయింది. పరస్పర సహకారంతో బ్రిక్స్ దేశాలు మరింత అభివృద్ధి చెందాలి. అంతర్జాతీయ సమస్యలకు మనం పరిష్కారం చూపించాల్సి ఉంది. మనం వేసే ప్రతి అడుగులో మానవాభివృద్దే కీలకం కావాలి. ఐరాస భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టాలి' అని సూచించారు.