KMM: మధిర పోలీస్ స్టేషన్‌లో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ రమేష్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ


