హైదరాబాద్: 28°C
వార్తలు

అందుకు గర్విస్తున్నా: నడ్డా

గత దశాబ్ద కాలంగా దేశంలో ఎన్నో ఆరోగ్యవిధానాలను తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. వంటగదే ఫార్మసీ, ఆహరమే ఔషధమని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతారని.. అది అక్షరాలా నిజమన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో ముందడుగని తెలిపారు.