కరోనా తర్వాత ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో రూ.64 వేల కోట్లతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో రూ.1,271 కోట్లతో 24 క్రిటికల్ బ్లాకులు, 25 ఇంటిగ్రేటెడ్ లాబ్‌లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించబోతున్నట్లు చెప్పారు.
వార్తలు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.64 వేల కోట్లు: నడ్డా


