హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో వసంతోత్సవ సేవ

BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలోని శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించారు.