హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాల వైరింగ్ చోరీలతో యజమానుల ఆందోళన

JGL: జగిత్యాల జిల్లాలోని ఎండ్ల అంగడి పరిధిలో పార్కింగ్ చేసిన వాహనాల్లో వైరింగ్ చోరీలు పెరిగాయని యజమానులు వాపోతున్నారు. బైక్‌లు, బస్సులు, వ్యాన్‌లు, అంబులెన్స్‌ల నుంచి వైర్లు, ఇనుప సామగ్రి ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వాహనాలు స్టార్ట్ కాక మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చవుతోందన్నారు. దొంగలను పట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.