హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: సబ్ కలెక్టర్

ఖమ్మం: వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్‌ కలెక్టర్ అజయ్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కల్లూరు సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.