హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు'

SRPT: పట్టణంలోని 10వ వార్డులో ఝాన్సీ మనోజ్ ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో ఇవాళ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.