హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షానికే కూలిన ఎంపీడీవో కార్యాలయ ప్రహరీ గోడా

NZB: సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రహరీ గోడ చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. దీంతో కార్యాలయ భవనం పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే భవనంపై కప్పు శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పునర్ నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.