హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

RR: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ నేతృత్వంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో భక్తులకు 4 వేల విగ్రహాలు అందజేశారు. అలాగే ఈ దేవాలయ అభివృద్ధి, కోనేరు నిర్మాణం కోసం వైఆర్పీ ఫౌండేషన్ రూ.35 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.