హైదరాబాద్: 28°C
తెలంగాణ

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్.. 30 మంది బైండోవర్

SRPT: వినాయక చవితి వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇవాళ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా 30 మందికి పైగా వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.