హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వప్న మిస్సింగ్‌ కేసులో సంచలన విషయాలు

HNK: హసన్‌పర్తికి చెందిన స్వప్న మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారికి చెందిన కారు డ్రైవర్‌ బసవరాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. స్వప్న అతన్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే బసవరాజ్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.