హైదరాబాద్: 28°C
వార్తలు

రిషికేశ్‌లో ఓ మహిళకు ఊహించని ప్రమాదం

రోడ్డుపై స్కూటీని నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. రిషికేశ్‌లో ఓ రహదారిపై 2 ఎద్దులు ఆధిపత్యం కోసం ఒకదానితో మరొకటి కుమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి వాటిని చెదరగొట్టడానికి యత్నించాడు. అయితే ఓ ఎద్దు బెదిరి అదే రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. ఆమె పక్కనే ఉన్న కారును ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.