ఖమ్మం: కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం ప్రస్తుతం నిండుకుండలా మారింది. 23 అడుగుల పూర్తి నీటిమట్టానికి గాను శనివారం ఉదయానికి నీటిమట్టం 22 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో పాటు, ఎస్సారెస్పీ నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటిని అధికారులు సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
తెలంగాణ
నిండుకుండలా పాలేరు జలాశయం!


