హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జాఫర్‌ఘడ్ రైతుల నీటి సమస్యలు పరిష్కరించాలి'

JN: జాఫర్‌ఘడ్ మండల రైతుల నీటి సమస్యలను ప్రభుత్వం, కాంగ్రెస్ సర్పంచులు పట్టించుకోవడం లేదని బీజేపీ మండల అధ్యక్షుడు నాగేష్ గౌడ్ ఆరోపించారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ ఉన్నా కాలువల పనులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెరువులకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులతో ఉద్యమం చేపడతామన్నారు.